NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. కేంద్ర మాజీమంత్రి ఆగ్రహం

by Disha Web Desk 22 |
NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు.. కేంద్ర మాజీమంత్రి ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్పు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి విడదల రజనీ శాసన సభలో బిల్లు పెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు అధికార పార్టీ తీరుపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ఇలా పేరు మార్చడం ఏ మాత్రం సమంజసం కాదని.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ పోతే వైఎస్సార్ విగ్రహాలు మిగులుండేవి కాదని తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి తీవ్రంగా మండి పడ్డారు.

జగన్‌కు తండ్రిపై అంత ప్రేముంటే మరేదైనా సంస్థ స్థాపించుకుని వాటికి తన తండ్రి పేరు పేట్టుకోవచ్చని అన్నారు. ఈ క్రమంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇలా పేరులు మార్చుకుంటూపోతే రాబోయే రోజుల్లో అనేక అనర్థాలకు దారి తీసే అవకాశాలుంటాయని ఆయన అన్నారు. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఎద్దేవా చేశారు.


Next Story

Most Viewed