వైసీపీకి బిగ్ షాక్.. న్యాయ పోరాటానికి సిద్ధమైన మాజీ ఎమ్మెల్సీ

by srinivas |
వైసీపీకి బిగ్ షాక్.. న్యాయ పోరాటానికి సిద్ధమైన మాజీ ఎమ్మెల్సీ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రఘురాజు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఆయనను పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సభ్యత్వాన్ని సైతం రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తనను అన్యాయంగా ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించారని వైసీపీ అధిష్టానంపై మండిపడ్డారు. శాసనమండలి చైర్మన్ తన వివరణ అడగలేదని తెలిపారు. తన వివరణ తీసుకోకుండా ఎలా పదవి నుంచి తప్పించారని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పట్ల కక్ష పూరితంగా వ్యవరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలపై తాను న్యాయ పోరాటం చేస్తానని రఘురాజు హెచ్చరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చేయని తప్పునకు తనను బలి చేశారని వాపోయారు.

కాగా ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో రఘురాజు భార్య సుధారణి టీడీపీలో చేరారు. వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. సుధారాణి భర్త, ఎమ్మెల్సీ రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించింది. దీంతో రఘురాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య పార్టీ మారితే తనను బాధ్యుడిని చేయడం దారుణమని రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.Next Story

Most Viewed