ఆ స్థానం నుంచి పవన్ పోటీ..!.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
ఆ స్థానం నుంచి పవన్ పోటీ..!.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం అర్బన్ టికెట్‌ టీడీపీదా.. జనసేనకా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లోందని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం కోసం ప్రతినిత్యం కృషి చేసిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి అని ఎట్టి పరిస్థితుల్లో ఆయనకే ఇవ్వాలని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అటు జనసేన కూడా ఈ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో టీడీపీ ఇంచార్జి ప్రభాకర్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని.. తాజాగా కూడా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయకపోతే చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని చెప్పారు. అయితే అనంతపురం అర్బ‌న్ టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రభాకర్ చౌదరి తెలిపారు. అసెంబ్లీలో తన కంటే కూడా పవన్ కల్యాణ్ అవసరం ఎక్కువగా ఉంటుందని ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు.

Read More..

breaking:మీటింగ్ల కోసం ఆ పనులు చేయడం మీకు అలవాటు.. వైసీపీపై జనసేన ఫైర్

Next Story

Most Viewed