మాజీ ఎమ్మెల్యే నూకరాజు కన్నుమూత

by Disha Web Desk 2 |
మాజీ ఎమ్మెల్యే నూకరాజు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి స్వల్ప అస్వస్థతకు గురైన నూకరాజును సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, నూకరాజు పాయకరావు పేట నుంచి 1985, 1989, 1994 సంవత్సరాల్లో మూడు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతిపై టీడీపీ శ్రేణులు సంతాపం తెలియజేస్తున్నారు.

Next Story