చంద్రబాబుతో మాజీమంత్రులు యనమల, పరిటాల సునీతల భేటీ

by Seetharam |
చంద్రబాబుతో మాజీమంత్రులు యనమల, పరిటాల సునీతల భేటీ
X

దిశ , డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మాజీమంత్రులు పరిటాల సునీత, యనమల రామకృష్ణుడులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే గురువారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ మంత్రులు పరిటాల సునీత, యనమల రామకృష్ణుడులు కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు యోగ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుని కలసిన వారిలో పరిటాల సునీతతో పాటు బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, నారాయణ తదితరులు ఉన్నారు. ఇకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవడానికి ఏకంగా 15 గంటల సమయం పట్టింది. అనంతరం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకునేందుకు 2 గంటలకు పైగా సమయం పట్టింది. ఇకపోతే చంద్రబాబు నాయుడు ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed