సినిమాలు చేసుకో Pawan.. కొడాలి నాని సెటైరికల్ ట్వీట్

by Disha Web |
సినిమాలు చేసుకో Pawan.. కొడాలి నాని సెటైరికల్ ట్వీట్
X

దిశ వెబ్ సైట్: ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు జరిమానా విధించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత సమయంలో పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించారు. నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చి వేశారని.. బాధితులందరికీ లక్ష చొప్పున సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 27న పవన్ ఇప్పటంలో చెక్కులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఇప్పటం గ్రామానికి చెందిన 14 మందికి హైకోర్టులో చుక్కెదురైంది. నోటీసులు ఇచ్చాకే ఇళ్లు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని తాజాగా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటం పిటిషనర్లకు హైకోర్టు లక్ష జరిమానా విధించిందని గుర్తు చేశారు. తమ గురువు చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని.. తమరు ఎమ్మెల్యేగా గెలిచేది లేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకోవాలని.. మిడి మిడి జ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎందుకంటూ కొడాలి నాని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

చిక్కుల్లో గాయని Mangli (మంగ్లీ).. ఆ నిర్ణయమే కారణం!

Chandrababu: వైసీపీకి గుండు సున్నా.. పులివెందులోనూ ఖాయమే..!

Next Story

Most Viewed