AP News :నన్ను దెబ్బతీసేందుకు YSRCP నేత కుట్ర: Anil Kumar Yadav Poluboina

by Dishanational4 |
AP News :నన్ను దెబ్బతీసేందుకు YSRCP నేత కుట్ర: Anil Kumar Yadav Poluboina
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో నిత్యం మాట్లాడుతూ డబ్బులిచ్చి తనను తిట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ మంతనాలు మొత్తం చిట్టా తన వద్ద ఉందని... వాళ్ళ బొతుకంతా బయట పెడతానంటూ అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. మీ దగ్గర నుంచి ఎంతెంత నగదు వెళ్తుందో... అన్నీ నాకు తెలుసు వైసీపీలో ఉండి ఒక నేత సిగ్గుమాలిన పనులు చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. నన్ను తిట్టినందుకు ఒకడికి రూ.10వేలు పెద్దవాడికి అయితే రూ.లక్ష కలెక్షన్లు అని చెప్పుకొచ్చారు.

మా వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో టీడీపీ నాయకులు రోజూ మంతనాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బతుకులు మాకు తెలీదా? ఈ రెండు బ్యాచ్‌ల సంగతి మొత్తం చరిత్ర నా దగ్గర ఉంది. అనిల్ కుమార్ యాదవ్‌ను నెల్లూరు నగరంలో దెబ్బతీసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. వైసీపీలోనే ఉండి ఒక నాయకుడు నన్ను తిట్టమని వేరే వాళ్ళకి నగదు స్పాన్సర్ చేస్తున్నాడు. మీ కాల్ హిస్టరీ తీస్తే మొత్తం చరిత్ర బయటపడుతుంది అని అన్నారు.

వైసీపీలోనే కొంతమంది నాయకులకు ఫోన్ చేసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని బాగా తిట్టాము ఇంకా కలెక్షన్ బాగా ఇవ్వండి అని అడుక్కుటున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. నెల్లూరు నగరంలో పేటీఎం బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ ఎక్కువైపోయిందని ధ్వజమెత్తారు. అన్నిటినీ ఓపిక పట్టి చూస్తూ ఉన్నా ..అన్ని సంగతులు నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు అందరి చరిత్ర బయటపెడతా అని మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.


Next Story

Most Viewed