ముందే తెలిసినా ఎందుకు అప్రమత్తం చేయలేదు: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |
ముందే తెలిసినా ఎందుకు అప్రమత్తం చేయలేదు: మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలు ఏపీలో విజయవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ భారీ వరదలకు బుడమేరు వాగు కారణమైంది. అంతకు ఎన్నో రెట్లు పెద్ధదైన కృష్ణానది వరద విజయవాడను ఏమీ చేయలేకపోయింది. కానీ బుడమేరు వాగు మాత్రం నగరంలో చాలా ప్రాంతాల్ని ముంచెత్తింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కృష్ణానది వరదల నుంచి నగరాన్ని కాపాడిన ఆ ఫార్ములానే ఇక్కడా ఉపయోగించాలని నిర్ణయించింది. తాజాగా.. వరదలపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి.. అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విజయవాడలో విపత్తు చోటుచేసుకుందని అన్నారు. బుడమేరు నుంచి వరద వస్తుందని తెలిసి.. డీఈ చెప్పిన మాటలు లెక్క చేయలేదని ఆరోపించారు. ముందే తెలిసినా ఎందుకు అప్రమత్తం చేయలేదు. వరద నిర్లక్ష్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed