- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి 3 రోజుల కస్టడీ
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP) గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి(VenkataReddy)ని 3 రోజుల ఏసీబీ(ACB) కస్టడీకి ఇస్తూ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు వైసీపీ నాయకుల గనుల దోపిడిలో వెన్నంటి ఉన్నారని ఆరోపిస్తూ.. సెప్టెంబర్లో గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్ట్ రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో వెంకటరెడ్డిని విచారించేందుకు 7 రోజుల కస్టడీకి ఇవ్వమని ఏసీబీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏసీబీ కోర్ట్.. అక్టోబర్ రెండు నుండి మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా వైసీపీ హయాంలో జరిగిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడిలో వెంకటరెడ్డి అన్నీ తానై వ్యవహరించాడని ఏసీబీకి అందిన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 26న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.