AP is Under Threat: ఇలానే కొనసాగితే ముప్పు తప్పదు.. హెచ్చరిస్తున్న నిపుణులు

by Indraja |
AP is Under Threat: ఇలానే కొనసాగితే ముప్పు తప్పదు.. హెచ్చరిస్తున్న నిపుణులు
X

దిశ వెబ్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు కావొస్తుంది. దాయాధి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుంటే.. ఆంధ్రప్రదేశ్ పిరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలం గడుస్తున్నా నేటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. నిరుద్యోగం, పేదరికం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను అలాకుతలం చేస్తున్నాయి.

ప్రముఖ విద్యాసంస్థలు, ఇండస్ట్రీలతో విరాజిల్లాల్సిన ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్పుల కుప్పగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవరోధాలు ఎందుకు కలుగుదున్నాయి..?

నేతల మధ్య విబేధాలు..

రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు కలిసి కూలంకషంగా చర్చించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. కాని ప్రస్తుతం అధికార పార్టీకి ప్రతిపక్షాలకు మధ్య పచ్చగడ్డి వేసినా బగ్గుమంటోంది. ఒకరు ఏదారి అంటే మరొకరు గోదారి అంటున్నారు. అంధుకు ఆగిపోయిన రాజధాని నిర్మాణమే నిదర్శనం.

గత 10 సంవత్సరాలుగా పార్టీలు వైసీపీ, టీడీపీ రాష్ట్రంలో విరాజిల్లిన పార్టీలు. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీనితో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించి, నిర్మాణం పనులను ప్రారంభించారు.

అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో టీడీపీ ఒటమిని చవిచూసింది. కాగా ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో అప్పటికే నిర్మాణంలో ఉన్న అమరావతిపై దృష్టి పెట్టకుండా మూడు రాజధానుల ప్రస్తావనకు తెరలేపారు. మరి మూడు రాజధానుల్లో కనీసం ఒక్కదానికైనా పునాధి వేశారా..? అంటే అదీలేదు.

దీనితో ఉన్నదిపోయే, ఉంచుకుంది పోయే అన్నట్టు అటు అమరావతి పూర్తి కాకపోగా అక్కడ అప్పటికే జరిగిన నిర్మాణాలు శిథిలావస్తకు చేరుకున్నాయి. ఇటు మూడు రాజధానుల్లో ఒక్కటి కూడా పూర్తికాలేదు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్తలకు వైసీపీ ప్రభుత్వం చేసిన మర్యాదకు జీవితంలో మళ్లీ ఏపీలో పెట్టుబడి పెట్టే యోచన కలలో కూడా చేయమన్నారు. అలా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి.

రాబడికి మించిన ఖర్చు

రాబడిని దృష్టిలో ఉంచుకుని ఖర్చుచేయాలి. ఎంత రాబడి వస్తుంది, దేనికి ఎంత ఖర్చు చేయాలి, అప్పు చేయాల్సిన అవసరం ఉందా..? అనే ప్రణాళికతో పరిపాలన చేయాలి. అప్పు చేసి పప్పు కూడు తినడం కాదు, రాష్ట్రంలో సంపధను సృష్టించేందుకు మార్గాలను ప్రజలకు చూపాలి. ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలిగాని, బద్దకస్తులుగా మార్చకూడదు.

కాని గత ఐదేళ్లలో రూపాయి రాబడి ఉంటే వంద రూపాయల ఖర్చు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఉచిత పథకాలతో పేరుతో అవసరం లేని వాళ్లకు సైతం డబ్బులను పంచారు. అలానే ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి కల్పించ లేదు. దీనితో రాష్ట్రంలో రాబడి తగ్గింది, ఖర్చు పెరిగింది. చివరికి రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని, ఇది ఇలానే కొనసాగితే ఏపీ మరో బీహార్‌గా మారడం కాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story