చిరుతదాడిలో మృతి చెందిన చిన్నారికి అందని ఎక్స్‌గ్రేషియా: టీటీడీపై హైకోర్టు అసహనం

by Disha Web Desk 21 |
చిరుతదాడిలో మృతి చెందిన చిన్నారికి అందని ఎక్స్‌గ్రేషియా: టీటీడీపై హైకోర్టు అసహనం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి టీటీడీ ఎక్స్‌గ్రేషియా అందజేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో బుధవారం ఈ ఘటనపై వాదనలు జరిగాయి. ఎక్స్ గ్రేషియా చెల్లింపులో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో ధనిక ఆలయం ఆయినటువంటి టీటీడీ డబ్బు చెల్లించక పోవడం ఏమిటని ప్రశ్నించింది. నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ ఆఫిడవిట్‌లో సుముఖత వ్యక్తం చేసింది. అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాసులు ఏర్పాటు చేసేందుకు కూడా అభ్యంతరం లేదని వైల్డ్ లైఫ్ తెలిపింది. వైల్డ్ లైఫ్, టీటీడీ, రాష్ట్ర అటవీ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని పిటీషనర్ తరపు న్యాయవాది యాలమంజుల బాలాజీ కోరారు. హైకోర్టు పర్యవేక్షణ అవసరమని యలమంజుల బాలాజీ స్పష్టం చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తదితరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story