వైసీపీ గూటికి చేరిన మాజీమంత్రి గొల్లపల్లి.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
వైసీపీ గూటికి చేరిన మాజీమంత్రి గొల్లపల్లి.. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇటీవలే తొలి జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు దక్కని ఆశావాహులు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే రాజోలు నియోజకవర్గం ఇన్ చార్జి గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో చర్చల అనంతరం తాడేపల్లిగుడెంలోని సీఎం నివాసానికి వెళ్లి, సీఎం సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారని, పార్టీకి ఎంతో సేవ చేసిన మాలాంటి బడుగు వర్గాల జీవితాలను చిందరవందర చేశారని ఆరోపించారు. అలాగే మీ సొంత ఇంటికి మీరు ఎప్పుడైనా రావొచ్చు అని సీఎం జగన్ ఆహ్వనించారని, పార్టీ కార్యకర్తగా అయినా, నాయకుడిగా అయినా ఉంటానని, అంతేగాక పార్టీ ఎక్కడైన పోటీ చేయమని ఆదేశించినా కూడా పోటీకి సిద్దంగా ఉన్నానని తెలిపారు. కాగా గొల్లపల్లి సూర్యారావు టీడీపీ నుంచి రాజోలు స్థానం ఆశించారు. పొత్తులో భాగంగా రాజోలు టికెట్ జనసేనకు ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ ద్వారా తెలియజేశారు.

Read More..

బాబు, భువనేశ్వరితో ఆర్జీవి కాఫీ కబుర్లు.. ఫ్యాన్ ఫీజ్ ఫట్టా..?



Next Story