అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడే : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

by Shiva Kumar |
అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం నియంత పోకడే :  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చమని నిరసన తెలిపితే.. అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగించడం జగన్ నయంత పోకడకు నిదర్శమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కన్నతల్లికే మర్యాద ఇవ్వని వ్యక్తికి అంగన్‌వాడీల విలువ ఏం తెలుస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తాము లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దురదృష్టకరమని అన్నారు. సీఎం జగన్ చర్యలను నియంత పోకడలకు పరాకాష్ట అని అన్నారు. జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతును ఇస్తుందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed