‘దిశ కథనం’ ఎఫెక్ట్.. సీఎం జగన్, రాంగోపాల్ వర్మపై దారుణమైన ట్రోల్స్

by Disha Web Desk 6 |
‘దిశ కథనం’ ఎఫెక్ట్.. సీఎం జగన్, రాంగోపాల్ వర్మపై దారుణమైన ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల దారుణంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘‘రోజా నీ బతుకు ఎవడికి తెలియదు. బ్లూ ఫిల్మ్‌లో యాక్ట్ చేసిన దానివి. అవి మా దగ్గరున్నాయి. బయటపెట్టకూడదని, ఎప్పుడూ రిలీజ్ చేయలేదు. నీ బతుకు విప్పమంటావా? రికార్డింగ్ డ్యాన్సులు, కిరాయికి డ్యాన్సులు వేసే నువ్వు అదృష్టం బాగుండి మంత్రి అయిపోతే ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడతావా’’ అంటూ బండారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఈ మాటలకు రోజా కన్నీరు పెట్టుకున్నారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. గుంటూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కుష్భు, రాధిక, మీనా, కవిత, రోజాకు సపోర్ట్‌గా నిలిచారు. అయితే ఇటీవల నటి గాయత్రి గుప్త ఆర్జీవి తనను వాడుకుని వదిలేశాడని కామెంట్స్ చేసింది. ‘‘దిశ పత్రిక’’లో ఈ వార్త రావడంతో దాన్ని టీడీపీకి సంబంధించిన స్వాతి రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేసింది. అంతేకాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇప్పుడు గాయత్రి గుప్తా కు మద్దతుగా రోజా వస్తుందో, రమ్య కృష్ణ వస్తుందో, మీనా వస్తుందో, కుష్బూ వస్తుందో, కవిత వస్తుందో, వాడితో వ్యూహం లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమాలు తీయిస్తున్న వాళ్ళు, ఆ గలీజ్ పార్టీ వాళ్ళు వస్తారో చూడాలి.. రోజాని ఏదో అన్నారని ఎగేసుకు వచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలని ఉంది’’ అని రాసుకొచ్చింది. అది కాస్త వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు సీఎం జగన్, ఆర్జీవి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Next Story