యనమలకు చెక్ పెట్టబోతున్నారా?

by Disha Web Desk 16 |
యనమలకు చెక్ పెట్టబోతున్నారా?
X
  • చంద్రబాబును కలిసిన రాజా అశోక్ బాబు
  • తుని నియోజకవర్గంలో ప్రకంపనలు
  • యనమల కుటుంబానికి చెక్ పెట్టే ప్రయత్నాలు
  • మంత్రి దాడిశెట్టిని ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు
  • టీడీపీ వర్గాల్లో ప్రారంభమైన చర్చలు
  • టీడీపీలో క్షత్రియ కోటా నుంచి అశోక్ బాబు పెద్దన్నయ్య పాత్ర పోషించనున్నారా?
  • ఆలోచనలో పడ్డ తూర్పు గోదావరి జిల్లా క్షత్రియ టీడీపీ నేతలు

దిశ (ఉభయ గోదావరి): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తుని నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు రాజా అశోక్ బాబు కలవడం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. సుధీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ‌లో సేవలందించి, స్థానికంగా క్షత్రియ వర్గంలో మంచి పలుకు బడి ఉన్న వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం పెద్ద చర్చనీయాంశమైంది. విషయాన్ని అశోక్ బాబు తేలిగ్గా కొట్టి పారేస్తున్నా తెర వెనుక మాత్రం పెద్ద ప్లాన్ నడుస్తున్నట్లే సమాచారం.

వాస్తవానికి తుని నియోజకవర్గంలో యనమల కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు ఇవ్వాలనే ఆలోచన టీడీపీలో ఉన్నట్లు ఇటీవల తాజా సమాచారం. యనమల కుటుంబానికి అయితే ఓట్ల పడవని, ఈసారి తునిలో కొత్త వ్యక్తికి ఇస్తే టీడీపీ జెండా సులువుగా పాత వచ్చని పార్టీ ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అంతేగాక రహదారుల భవానాల శాఖామంత్రి దాడిశెట్టి రాజా వైఎస్సార్ సీపీ పార్టీలో దూసుకుపోతున్నారు. గత రెండు సాధారణ ఎన్నికల నుంచి గెలుపు ఆయననే వరిస్తుంది. ఈసారి స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తికి సీటు ఇస్తే దాడిశెట్టిని సునాయాసంగా ఓడించ వచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో రాజా అశోక్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం పెద్ద చర్చగా మారింది. తెర వెనుక ప్రయత్నంలో భాగంగా అశోక్ బాబును తుని నుంచి పోటీ చేయించే ప్రయత్నంలో ఉన్నారా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అటు అశోక్ బాబుకు తుని సీటు ఇస్తే ప్రక్కనే ఉన్న పిఠాపురం మాజీ ఎంఎల్ఏ వర్మ, ముమ్మిడివరం మాజీ యంఎల్ఏ దాట్ల బుచ్చి బాబులకు సీట్లు ఎలా ఇస్తారు. క్షత్రీయ కోటాను ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్న ప్రశ్నార్దకంగా మారింది.

కాంగ్రెస్‌కు వీరాభిమాని రాజా అశోక్ బాబు

తుని నియోజకవర్గంలో రాజా అశోక్ బాబుకు సానుకూలమైన పేరు ఉంది. వివాద రహితుడు, వర్గ విభేదాలు లేని వ్యక్తిగా చెబుతుంటారు. అయితే అశోక్ బాబు 2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా ఉండేవారు. తర్వాత 2014లో ఆయన పోటీ చేయకుండానే టీడీపీ దిగ్గజం అయిన యనమల రామక్రుష్ణుడు కుటుంబీకులకు సపోర్టు చేశారు. నాటి నుంచి ఆయన యనమలకు సపోర్టుగానే ఉంటున్నారు.

యనమలకు చెక్ పెట్టే ఆలోచనా?

రాజా అశోక్ బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలవడం పట్ల చాలా తెర వెనుక మంతనాలు జరిగినట్లు సమాచారం. వాస్తవానికి ఈసారి తుని సీటు యనమల కుటుంబానికి కాకుండా వేరే వారికి ఇచ్చే ఆలోచనలో పార్ట ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాజా అశోక్ బాబును చేరదీస్తున్నట్లు తెలుస్తుంది. అశోక్ బాబు అయితే అటు పార్టీలో యనమల కుటుంబానికి చెక్ పెట్టడంతో పాటు రెండు పర్యాయాల నుంచి నెగ్గుతున్న మంత్రి దాడిశెట్టి రాజాను కూడా ఓడించడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనలో ఉన్నారు. ఇలా రెండు విధాలుగా పని అవుతుందని అనుకొంటున్నారు. వివాద రహితుడైన రాజాకు సీటు ఇస్తే గ్రూపుల సమస్యలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారని భావిస్తున్నారు.

మరి క్షత్రియుల కోట పరిస్థితి ఏంటీ

నిజంగా రాజాకు సీటు ఇస్తే జిల్లాలో ఇద్దరు క్షత్రియులు పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇందులో ఒకరు పిఠాపురం మాజీ శాసన సభ్యులు వర్మ, మరొకరు ముమ్మడివరం మాజీ శాసన సభ్యుడు దాట్ల సుబ్బారాజు. వీరు పార్టీకి విధేయులుగా ఉంటున్నారు. ఒక వేళ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వర్మకు సీటు ఇవ్వలేమనే భావనతో అలా చేస్తున్నారా?. మిత్ర పక్షాల సీటు సర్దుబాటుల్లో ముమ్మడివరం జనసేనకు వెళ్లితే దాట్ల సుబ్బారాజుకు కూడా సీటు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని, అటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే చంద్రబాబును కలవడంపై రాజా అశోక్ బాబు ఎటువంటి ప్రకటన చేయడంలేదు. సాధారణంగానే కలిశానని, ఎటువంటి తెర వెనుక రాజకీయ వ్యూహాలు లేవని అంటున్నారు.


Next Story

Most Viewed