అన్ని అప్పులు ఎందుకు చేశావ్ జగన్: Yanamala

by Disha Web Desk 16 |
అన్ని అప్పులు ఎందుకు చేశావ్ జగన్: Yanamala
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వానికి వ్యవస్థలపై ఏమాత్రం గౌరవం లేదని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంటుపై గానీ...రాజ్యాంగంపై గానీ విలువ లేదని ఆయన విమర్శించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు. విభజన చట్టంలో ఒకే రాజధాని అని చాలా స్పష్టంగా పేర్కొ్న్నా.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు తీసుకొచ్చిందని గుర్తు చేశారు.

రెండు సార్లు పిలిచాం..

అయితే రాజధానిపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మంత్రి విశాఖ ఒక్కటే రాజధాని అంటే.. మరో మంత్రి మూడు రాజధానులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై, అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు రావాలని రెండు సార్లు పిలిచినా వైసీపీ నుంచి ఎటుంవంటి స్పందన లేదని యనమల రామకృష్ణుడు చెప్పారు.

ఎందుకు అప్పులు చేశారో చెప్పాలి..?

బడ్జెట్‌లో చూపిన అప్పులు కంటే ఎక్కువగా ఎందుకు అప్పులు చేశారో ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పగలదా? అని యనమల ప్రశ్నించారు. బడ్జెటేతర అప్పుల గురించి అధికారులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 'కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు ప్రభుత్వం వాడుకుంటున్నప్పుడు ఆ అప్పులు మాకు సంబంధం లేదని ఎలా చెబుతారు?. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన రూ.8300 కోట్లకు ప్రభుత్వ ఆదాయాన్ని ఎందుకు ఎస్క్రో చేశారు?. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టానికి సవరణ చేసి 90 శాతం ఉన్న లిమిట్ ఉన్న గ్యారెంటీలను 180 శాతంకు ఎందుకు పెంచారు?. ఈ నాలుగేళ్లలో ఎన్నికోట్లు వేస్ అండ్ మీన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఎన్ని రోజులకు ఓడీకి వెళ్లారు. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్సు ద్వారా ఎంత తీసుకున్నారో సి.ఎం.ఓ చెప్పగలదా?.' అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డిఫెసిట్ విఫరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. విభజన నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 2.62 శాతం ఉంటే దాన్ని 2018-19 నాటికి 1.61 శాతంకు టీడీపీ తగ్గించిందని యనమల తెలిపారు.

వైసీపీ పాలనలో పెరిగిన రెవెన్యూ లోటు

అయితే వైసీపీ పాలనలో రెవెన్యూ లోటు 3.60 కు పెరిగిందని యనమల చెప్పుకొచ్చారు. '2018లో రూ.16 వేల కోట్లు ఉన్న రెవెన్యూ లోటు నేడు రూ.40 వేల కోట్లకు ఎందుకు పెరిగింది?. 2018 నాటికి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ రూ.2.5 లక్షల కోట్లు ఉంటే ఈ మూడేళ్లలో అవి 4.42 లక్షల కోట్లకు ఎందుకు పెరిగాయి?. ఇది రెండింతలు పెరగలేదా?. 2018-19లో 27.59 ఉన్న స్థూల ఆదాయంలో అప్పుల శాతం నేడు 39.43 శాతంకు ఎందుకు పెరిగింది?. ఇందుకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?.' అని యనమల రామకృష్ణుడు సవాల్ విసిరారు.


Next Story

Most Viewed