Kakinada: పోలీస్ స్టేషన్‌లో చిన్నారి హత్య అనుమానితుడు.. బయట సంబురాలు

by srinivas |   ( Updated:2023-09-27 13:13:03.0  )
Kakinada: పోలీస్ స్టేషన్‌లో చిన్నారి హత్య అనుమానితుడు.. బయట సంబురాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 20న కాకినాడలో చిన్నారి హత్య‌కు గురయ్యారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు అనుమానితుడు నానిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని అనుమానితుడు స్కూలు నుంచి తీసుకెళ్లారు. ఆ తర్వాత చిన్నారి దారుణ హత్యకు గురైంది. అయితే చిన్నారి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

అయితే పలువురు గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అయితే అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా రాష్ట్ర పోలీసులపై పలువురు విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కొందరు కావాలని ఇలాంటివి చేస్తున్నారని కొందరు స్థానికులు అంటున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుంటేనే సంబురాలు చేసుకుంటే.. రాష్ట్రంలో చాలా దురాగతాలు జరుగుతున్నాయని.. నిందితులకు కఠినమైన శిక్షలు అమలు కావడంలేదని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. చాలా కేసుల్లో ఏళ్ల తరబడి కూడా న్యాయం జరగడంలేదని అంటున్నారు. చిన్నారిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయాలి గానీ.. ఘటన జరిగిన వారం తర్వాత అనుమానితుడిని అదుపులోకి తీసుకుంటే పోలీస్ జిందాబాద్ అనడమేంటోనని సెటైర్లు వేస్తున్నారు.



Next Story

Most Viewed