Rajahmundry: అల్లుడు దారుణం.. మామ మృతి, ఆత్త పరిస్థితి విషమం

by Disha Web Desk 16 |
Rajahmundry: అల్లుడు దారుణం.. మామ మృతి, ఆత్త పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అల్లుడు అత్యంత దారుణానికి పాల్పడ్డారు.అత్తమామలపై గ్యాస్ సిలిండర్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో మామ అక్కడికక్కడికే మృతి చెందారు. అత్త పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెకు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మామ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story