మట్టిని పరిరక్షిద్దాం భావితరాలను కాపాడుకుందాం

by Disha Web Desk 16 |
మట్టిని పరిరక్షిద్దాం భావితరాలను కాపాడుకుందాం
X

దిశ, ఉత్తరాంధ్ర: (విశాఖపట్నం) మట్టిని పరిరక్షిద్దాం భావితరాలను కాపాడుకుందామంటూ కాలేజీ విద్యార్థులు, పలు ఎన్జీవోలు, వాలంటీర్లు, విశాఖ నగర వీధుల్లో ప్లకార్డులు ప్రదర్శించి నినదించారు. ప్రపంచ మట్టి దినోత్సవ సందర్భంగా ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం మద్దిలపాలెం నుంచి గురుద్వారా వరకు ర్యాలీను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వాలంటీర్ విటల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ భూములు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ మట్టే సమస్త జీవకోటికి ఆధారం, కాబట్టి వ్యవసాయ భూముల్లో కనీసం 3-6శాతం సేంద్రీయ పదార్ధం ఉండేలా చట్టాలు రూపొందించాలని, ప్రపంచ దేశాలను కోరుతూ సద్గురు 30 వేల కిలోమీటర్ల బైక్ ర్యాలీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దీని కోసం సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100 రోజులు ఏకధాటిగా 27 దేశాల గుండా ఒంటరిగా మోటార్‌సైకిల్ పైన ప్రయాణం చేశారని తెలిపారు. ఇందులో 390 కోట్ల మంది భాగం అయ్యారు. 81 దేశాలు తమ మద్దతును అందించారన్నారు. రైడ్ ఫర్ సాయిల్ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించిన మట్టి నాణ్యత పెంచు మార్గాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వాలంటీర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed