- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > ఆంధ్రప్రదేశ్ > తూర్పుగోదావరి > Amalapuram: మంత్రి కుమారుడికి నిరసన సెగ.. కరెక్ట్ టైమ్ చూసి అడ్డుకున్న స్థానికులు
Amalapuram: మంత్రి కుమారుడికి నిరసన సెగ.. కరెక్ట్ టైమ్ చూసి అడ్డుకున్న స్థానికులు

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు పరాభవం ఎదురైంది. అమలాపురం మండలం కామగరువులో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమలాపురం అల్లర్లలో తమను అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలలు తమను జైలు పాలు చేసి ఇప్పుడు ఎందుకు తమ గ్రామానికి వచ్చారని నిలదీశారు.
కాగా అమలాపురం అల్లర్ల సమయంలో మంత్రి విశ్వరూప్ నివాసం దహనం అయింది. అయితే ఆ కేసులో కామగరువు గ్రామానికి చెందిన వాళ్లపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో చాలా మంది గ్రామస్తులు మూడు నెలలు జైలు జీవితం గడిపారు. అప్పటి నుంచి కూడా వారంతా మంత్రి విశ్వరూప్‌పై గుర్రుగా ఉన్నారు. ఇవాళ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ వెళ్లడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శ్రీకాంత్‌ను కొందరు అధికారులు పక్కకు తీసుకెళ్లారు.
Next Story