Breaking: ఆ గుణం రెడ్లకే ఉంది.. అందుకే అలా అవుతున్నారని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
Breaking: ఆ గుణం రెడ్లకే ఉంది.. అందుకే అలా అవుతున్నారని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కాపు రాజకీయాలు కొనసాగుతున్న వేళ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు కాపుల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయన మాత్రం పూర్తిగా ఒక కులం వైపే ఒన్ సైడ్‌గా వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాల్లో రెడ్లే పోటీ చేయాలనే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు రెడ్లనే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించాలని అనుకుంటున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రెడ్లే అవుతారని జోస్యం చెప్పారు. పది మందికి సేవ చేసే గుణం రెడ్లకే ఉందని ద్వారంపూడి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అయితే సేవ చేసే గుణం రెడ్లకే ఉందనడంపై మిగిలిన కులాల వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవ గుణం మనుషులను బట్టి ఉంటుందని కులాలను బట్టి కాదని అంటున్నారు. ఇప్పటికైనా ద్వారంపూడి తెలుసుకోవాలని.. తమ కులానికి తాము మద్దతు ఇవ్వడం తప్పుకాదని.. ఇతర కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు. ఇప్పటికైనా తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.



Next Story

Most Viewed