రాజధాని ఫైల్స్‌తో జగన్ వెన్నులో వణుకు..!

by Disha Web Desk 16 |
AP News CM Jagan Lays The Foundation Stone For Apache Company
X

దిశ, కాకినాడ ప్రతినిధి: రాజధాని ఫైల్స్ సినిమాతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎద్దేవా చేశారు. ‘రాజధాని ఫైల్స్’ సినిమాను వనమాడి కొండబాబు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి దేవి మల్టీప్లెక్స్ థియేటర్లలో స్పెషల్ షో ద్వారా వీక్షించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై తీసిన రాజధాని ఫైల్స్‌తో తాడేపల్లి ప్యాలస్‌కు బీటలు ఏర్పడ్డాయన్నారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు బతుకు చిత్రం పై తీసిన సినిమాను అడ్డుకునే నీచ స్థితికి జగన్ రెడ్డి ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. సామాజిక బాధ్యతతో సినిమా తీస్తే జగన్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. సినిమా ద్వారా ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లి నిలుపుదలకు కుట్రలు పన్నారని తెలిపారు. 34 వేల మంది రైతుల త్యాగాలకు వాస్తరూపంగా నిలిచిన రాజధాని ఫైల్స్ సినిమా నిలిచిందని వనమాడి కొండబాబు పేర్కొన్నారు.


5 కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని ఛిద్రం చేసిన తుగ్లక్ జగన్ రెడ్డి అని కొండబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ఆంధ్రులను సీఎం జగన్ మోసం చేశాడని ఆరోపించారు. ప్రాంతాల పేరుతో ప్రజలను విడగొట్టి, రాజకీయ లబ్ది పొందాలని చూశాడని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మాట మార్చి మడమ తిప్పాడని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు సైకో చేష్టాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మించడం జగన్‌కు చేతకాదని, నిన్నటి దాక మూడు రాజధానుల పాట పాడిన జగన్ నేడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని నాటకాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరుతో ఏపీని నిలుపు దోపిడి చేసారన్నారు. ఐదేళ్లలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలిపాడని కొండాబాబు విమర్శించారు.


Next Story

Most Viewed