నాలుగు కూడా గెలవరు.. జనసేన లిస్టుపై అనిల్ కుమార్ సెటైర్లు

by srinivas |
నాలుగు కూడా గెలవరు.. జనసేన లిస్టుపై అనిల్ కుమార్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ సెటైర్లు వేశారు. టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్‌పై స్పందించిన ఆయన పవన్ కల్యాణ్ కనీసం 15 శాతం సీట్లు కూడా తీసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తీసుకున్న 24 సీట్లలో నాలుగు కూడా గెలవరని సెటైర్లు వేశారు. జనసైనికుల ఆశయాలను చంద్రబాబు కాళ్ల వద్ద పవన్ కల్యాణ్ తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కూటమి ఓడిపోతుందని అనిల్ కుమార్ తెలిపారు. ఇందుకు కారణం పవన్ కల్యాణే కారణమని చంద్రబాబు తప్పుకుంటారని అనిల్ జోస్యం చెప్పారు. రాజానగరంలో జనసేన అభ్యర్థిపై జక్కంపూడి రాజా భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి అనిల్ ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed