ఆయన ఆదేశిస్తే పోటీ చేస్తా: అలీ

by Disha Web Desk 16 |
ఆయన ఆదేశిస్తే పోటీ చేస్తా: అలీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశిస్తే పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సినీనటుడు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారు అలీ ప్రకటించారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే తాను రకరకాల నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారని అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఆర్‌పీఎల్‌ క్రికెట్ టోర్నమెంట్‌ను అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన టీమ్స్‌కు అభినందనలు తెలిపారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగాయని గుర్తుచేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు సైతం సమాధానం ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

కాగా సినీనటుడు అలీ సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితవుడు. ఇటీవలే అలీని ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. తిరుపతిలో రాజకీయాలపై అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరంటూ అలీ కుండబద్దలు కొట్టారు.


Next Story

Most Viewed