దాడులు చేస్తే పతనమే..Ycp Governmentకు దళితుల వార్నింగ్

by srinivas |
దాడులు చేస్తే పతనమే..Ycp Governmentకు దళితుల వార్నింగ్
X

దిశ ( ఉభయ గోదావరి): రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దాడులు చేస్తే వారి పతనం ప్రారంభమవుతుందని వక్తలు పేర్కొన్నారు. అలాగే దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత బాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని, ఇంత జరుగుతున్నా సీఎం జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో వివరించాలని డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ అంబేద్కర్ భవన్‌లో 'ఎస్సీ, ఎస్టీలపై దాడులు హత్యలు- చట్ట పరమైన మార్గాలు' అనే అంశంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్సీ ఎస్టీ జేఏసీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి సమైక్య తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు హాజరై వారి గళాన్ని వినిపించారు. కాకినాడలో ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి వారి ఇంటికే డోర్ డెలివరీ చేసినా అతన్ని ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించకుండా, శిక్ష నుండి కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తూ వస్తుందన్నారు. సరైన సమయానికి పోలీసులు తగు నివేదన అందజేయకుండా కాలయాపన చేస్తూ కోర్టులను తప్పుదారి పట్టించారన్నారు. 200 రోజులు అనంతరం అనంతబాబుకు కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్ ఇస్తే వైసీపీ పెద్దలు, నాయకులు భారీ స్వాగతాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు.

అనంత బాబును కాపాడేందుకు జిల్లా ఎస్పీ సహకరించారన్నారు. తొలి నుంచి అనంత బాబుపై కేసులను నమోదు చేయకుండా ఎన్నో అబద్ధాలు చెప్పారని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్రాసిటీ చట్టంపై అవగాహన లేని పోలీసులు వల్ల ఎస్సీలతోపాటు గిరిజనులు కూడా చాలా అన్యాయం జరుగుతుందన్నారు. అట్రాసిటీ చట్టాన్ని తప్పుదారి పట్టిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి ఫొటోలతో కూడిన కర పత్రాన్ని ముద్రించి ఇంటింటికి పంచడం, ఆయన లేకుండా సభల్లో అతను గురించి గొప్పలు చెప్పడం ఏంటో వైసీపీ పెద్దలు నోరు విప్పాలని చెప్పారు. అనంతబాబు ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో అక్రమాలు చేశారని ఇప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. అటువంటి అనంతబాబు జైలు నుంచి వస్తే పూల వర్షంతో స్వాగత ఏర్పాటు చేయడం వెనక ఆంతర్యంతో చెప్పాలన్నారు. తక్షణమే వీధి సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణ జరగాలని, దానికి ప్రభుత్వం సహకరించాలని, అతని సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి అండగా నిలవాలని వక్తలు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అట్రాసిటీ చట్టంపై తాము అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2019 నుండి 2022వ సంవత్సరం వరకు జిల్లాలో 784 అట్రాసిటీ కేసులు నమోదవుతే కేవలం 30 కేసులో మాత్రమే పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారన్నారు. పోలీసులు తీరు వల్ల, వహిస్తున్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో కేసులు నమోదు కావడం లేదన్నారు. చట్టంపై అవగాహన లేని పోలీసులపై చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ముప్పాళ్ళ సుబ్బారావు, జంగా గౌతమ్, కేఎస్ శ్రీనివాస్, కొండేపూడి ఉదయ్ కుమార్, పిట్టా వరప్రసాద్, బచ్చల కామేశ్వరరావు, గుడాల కృష్ణ, సబ్బతి ఫణేశ్వరరావు, తుమ్మల నూకరాజు, తాడి బాబ్జి, కాశి బాలయ్య, కొల్లాబత్తుల అప్పారావు, మాతా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Next Story

Most Viewed