Chandrababu: ప్రజా అజెండానే టీడీపీ అజెండా

by Disha Web Desk 16 |
Chandrababu: ప్రజా అజెండానే టీడీపీ అజెండా
X
  • సీఎం పదవి నాకు కొత్త కాదు
  • ఇది నాకు చివరి ఎన్నికలు కాదు
  • వైసీపీ సైకోలను భూ స్థాపితం చేసే వరకు ఉంటా
  • రేపు ఏం కావాలి అని ఆలోచించి పని చేస్తా
  • టీడీపీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోంది
  • వైసీపీ ఒకే సామాజిక వర్గానికే అన్ని పదవులు కట్టబెడుతుంది
  • నిడదవోలు రోడ్‌షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

దిశ, డైనమిక్ బ్యూరో : 'నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు.....రాష్ట్రం నాశనం అవుతుంటే కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. అందుకే ప్రజల్లోకి వచ్చాను. ఎన్నో సార్లు నేను నిడదవోలు వచ్చాను...కానీ ఎప్పుడూ ఇంత ఆదరణ చూడలేదు. నేను సినిమా నటుడిని కాదు....నా సినిమా రిలీజ్ కాలేదు. కానీ అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తోంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 'నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను...కానీ ఇంత నీచమైన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు' అని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో రోడ్‌లో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి అన్ని స్థానాలను టీడీపీ గెలుపొందేలా కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.'పార్టీలో ఎవరూ సొంత అజెండాలు వద్దు...ప్రజా అజెండానే మన అజెండా కావాలి' అని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

తెలంగాణకు అమర్ రాజా బ్యాటరీస్ తరలిపోవడం బాధాకరం

'రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోయింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనం. అమర్ రాజా రూ.9,500 కోట్ల పెట్టుబడి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 'అమర్ రాజాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమి ఇస్తే ఆయన కొడుకు ఆ కంపెనీని ఇబ్బంది పెడుతున్నాడు. నాడు తెచ్చిన రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు పూర్తిగా వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకోవాల్సిన పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత శిఖరాలకు వెళ్లిన నారాయణ సంస్థల అధిపతి నారాయణను బెదిరించారు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

రేపు ఏం కావాలో ఆలోచించి పనిచేస్తా

'పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తే అడ్డుకుంటున్నారని.. నా హయాంలో 22 సార్లు పోలవరంలో పర్యటించాను. 82 సార్లు రివ్యూ చేశాను. ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని దూరదృష్టితో పనిచేశాను. ముంపు మండలాలు ఏపీకి ఇస్తే తప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చెయ్యనని కేంద్రానికి చెప్పానన్నారు. దీంతో అప్పుడు 7 మండలాలను ఏపీలో కలిపారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అయితే దుర్మార్గపు ముఖ్యమంత్రి పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడు అని ధ్వజమెత్తారు. పోలవరంలో జరిగింది చూస్తే కడుపు రగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇది తనకు చివరి ఎన్నికలు కాదని....వైసీపీ సైకోలను భూ స్థాపితం చేసే వరకు ఉంటానని చంద్రబాబు హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు తాను ఉంటానని. యువత అంతా తన మీటింగ్‌లకు తరలి వస్తున్నారన్నారు. వారిలో కసి కనిపిస్తోందని... రేపు ఏం కావాలని ఆలోచించి పని చేస్తానని చెప్పారు...అందుకు హైదరాబాద్ ఒక ఉదాహరణ అని చంద్రబాబు నాయుడు వివరించారు. 'సంక్షేమానికి, అభివృద్ధికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని పేరు పెడితే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అదే కరెక్ట్ అని అన్ని వర్గాలు అంగీకరించాయి.'' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ సామాజిక వర్గం పార్టీ

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ఆయన తనయ వైఎస్ సునీతా రెడ్డి పోరాటంతో తండ్రి కేసు తెలంగాణకు బదిలీ చేశారని... అందుకే ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని అంటున్నానని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీకి అన్నీ ఉన్నాయని.....కానీ అల్లుడి నోట్లో శని ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి శనిలా పట్టిన జగన్‌ను వదిలించుకోవాలని అని పిలుపునిచ్చారు. సర్పంచ్‌లకు అధికారాలు లేకపోవడం.. పంచాయితీలకు డబ్బులు లేకపోవడంతో చివరకు వాళ్లే చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చే పరిస్థితికి వచ్చారనిని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉద్యోగస్తులు అందరినీ బెదిరించాడని చెప్పారు. ఇప్పుడు టీచర్లు ఎన్నికల్లో విధులు చేపట్టకూడదు అని ఉత్తర్వులు తెచ్చాడని మండిపడ్డారు. తన జీవితంలో ఒకే వర్గానికి పని చేసింది లేదని.. తమది సామాజికవర్గం పార్టీ అని, తెలుగుదేశం అన్ని వర్గాల పార్టీ అని చంద్రబాబు తేల్చి చెప్పేశారు.


Next Story

Most Viewed