- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కోడిపందెందారులకు బంపర్ ఆఫర్.. ఫోన్ పే, గూగుల్ పేతో క్యాష్

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగకు దుమ్మురేగిపోవాల్సిందే. కోడి పందేలు, పేకాట, గుండాటలతో అక్కడి స్థానికులు హోరెత్తిస్తారు. వీటిలో ప్రధానమైంది కోడి పందేలు. కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతారు. సంక్రాంతి మూడు రోజుల పాటు ఇది సాంప్రదాయ క్రీడ. దీని కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పందెం ప్రియులు వస్తారు. రావడమే కాదు కోళ్ల పందేల్లో పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా కాస్తారు.
అయితే ఈ ఏడాది పందెందారులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. చేతిలో క్యాష్ లేకపోయినా వెంటనే డబ్బులు వచ్చే మార్గాలను రెడీ చేశారు. బెట్టింగుల్లో చేతిలో ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినా ఆన్ లైన్ ద్వారా తీసుకునే సదుపాయం ఏర్పాటు చేశారు. పందెం బరుల వద్ద గూగుల్, ఫోన్ పే స్టాళ్లను ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లి ఆన్ లైన్ ద్వారా పేమెంట్ జరిపి క్యాష్ తీసుకోవచ్చు. కొంచెం కమీషన్ తీసుకుని డబ్బులు చేతికి ఇస్తారు. ఇలా పెద్ద ఎత్తున డబ్బులు ఆన్ లైన్ ట్రాన్స్‌ట్రాక్షన్స్ కూడా జరుగుతున్నాయి.