వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. ఇకపై ఆ డ్రెస్‌లు ధరించకూడదంటూ ఆంక్షలు..

by Disha Web Desk 7 |
వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్.. ఇకపై ఆ డ్రెస్‌లు ధరించకూడదంటూ ఆంక్షలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యార్ధుల దుస్తులపై రాష్ట్ర వైద్య విద్యాశాఖ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మహిళ వైద్యులు, వైద్య విద్యార్ధులు జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కొందరు విద్యార్థులు, మహిళ వైద్యులు వాటిని పాటించడం లేదు. దీంతో ఈ సారి డ్రెస్ కోడ్‌పై సీరియస్ ఆంక్షలు విధించారు. బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో.. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇకపై బోదనాసుత్రిలో మహిళ వైద్యులు, వైద్య విద్యార్ధులు చుడిదార్ లేదా చీర ధరించాలని తెలిపారు. అంతే కాకుండా జుట్టును వదిలేయకుండా హెయిర్ బాండ్‌తో ముడివేయాలని, యాప్రాన్‌తో సహ మెడలో ఖచ్చితంగా స్టెతస్కోప్ ధరించాలని ఆదేశాలు ఇచ్చారు. పురుష వైద్య విద్యార్ధులు షేవ్ చేసుకోవడంతో పాటు.. జుట్టు, గడ్డం మంచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్ పేషెంట్లుగా చేర్చుకోవాలస్సి వస్తే.. సహాయకులు లేరన్న కారణంగా వారిని చేర్చుకోవడానికి నిరాకరించవద్దని సూచించారు. ఇకనుంచి ఫేస్ అడెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.



Next Story