ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ.. క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే ఎంత మంది ఫాలోవర్సో తెలుసా?

by sudharani |
ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ.. క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే ఎంత మంది ఫాలోవర్సో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు రాజకీయ ప్రసంగాల్లో గొంతు వినిపిస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సోషల్ మీడియాలో సైతం భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే పవర్ స్టార్‌కు ఇప్పటి వరకు ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం అకౌంట్ లేదు. కానీ ఆయన పేరు మీద ఫ్యాన్స్ మిలియన్ల కొద్దీ పోస్టులు పెడుతుంటారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సైతం ఇన్‌స్టాలో అడుగుపెట్టబోతున్నట్లు.. కొణిదెల నాగబాబు స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ రోజు పవన్ కల్యాణ్ ఇన్ స్టా గ్రామ్‌లో కొత్త అకౌంట్ క్రియేట్ చేశారు. అకౌంట్ క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే 704K ఫాలోవర్స్ రావడం గమనార్హం. కాగా.. అకౌంట్ అయితే క్రియేట్ చేశారు కానీ అందులో ఏ విధమైన పోస్ట్ పెట్టలేదు. వపన్ కల్యాణ్ మొట్ట మొదటి పోస్ట్ ఏం పెడతారో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read More..

ఏపీలో..మంటలు రేపిన ‘వారాహి’ యాత్ర

స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. పవన్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ సంచలన పోస్ట్

హైదరాబాద్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?





Next Story

Most Viewed