ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం బాధాకరం: నందమూరి బాలకృష్ణ

by Disha Web Desk 21 |
ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం బాధాకరం: నందమూరి బాలకృష్ణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాపట్ల జిల్లా బాపట్ల మండలం భర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసాన్ని అగ్రనటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండించారు. అర్ధరాత్రి సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడటం పిరికిపందచర్యగా అభివర్ణించారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహంపై ఈ అమానుష ఘటన తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. అన్నగారిని అవమానించడమంటే తెలుగువారిని అవమానించడమేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మహనీయులను అవమానించే చర్యలు పరిపాటిగా మారాయి అని మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోసారి విధ్వంసక ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి అని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

Next Story