- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Pawan Kalyan:ఇంజినీర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
దిశ,వెబ్‌డెస్క్:నేడు(సెప్టెంబర్ 15) మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ డేగా(National Engineers Day) జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan kalyan) స్పందించారు. జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సూచికలైన ఇంజినీర్లకు(Engineers) హృదయపూర్వక శుభాకాంక్షలు అని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
ఈ సంవత్సరం ఇంజినీర్స్ డే సందర్భంగా ‘సుస్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ’ అనే నినాదంతో ఇంజినీర్లు తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి సాధించిన దేశంగా భారతదేశం వేగంగా ప్రయాణిస్తున్న వేళ ఇంజినీర్లు సేవలు అమూల్యమైనవని ఆయన ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే ప్రతి సవాలును మన ఇంజినీర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.