రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

by Dishafeatures2 |
రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
X

దిశ, అనకాపల్లి: రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అన్నారు. సోమవారం మండలం లోని తారువ గ్రామం క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు మాడుగుల, కోటపాడు, దేవరాపల్లి మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య సేవలకు వైఎస్సార్ హయంలో ఉన్న వైభవం తిరిగి తీసుకుని వచ్చే దిశగా సేవలు అందించడమే లక్ష్యమని, గత ప్రభుత్వం విస్మరించిన వైద్య సేవలను వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి గతం కన్నా ఎక్కువ అంబులెన్స్ లను ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు అన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో నిర్దిష్ట సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రజలకు అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కీలపర్తి భాస్కరరావు, కోటపాడు జెడ్పీటీసి అనురాధ, వైద్యాధికారి సబ్రమణ్యం, ఎంపీ హెచ్ ఈవో రాజశేఖర్, టిఎస్ ఎన్ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed