- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Polavaram:తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
by Jakkula Mamatha |
X
దిశ, పోలవరం:పోలవరం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడిన గోదావరి ఆదివారానికి తగ్గింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన గోదావరి నీటిమట్టం 31.510 మీటర్లు దిగువన 22.800 మీటర్లు నమోదయినట్లు ఈఈ మల్లిఖార్జునరావు తెలిపారు. స్పిల్వే నుంచి 7,58,919 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం తగ్గి కడమ్మ సూయిజ్ గేట్లు వరద నీటి నుంచి బయటపడడంతో ఏటిగట్టుకి కుడివైపున ఉన్న పంటపొలాల్లో నీరు లాగేసింది. రైతులు ఇతర ప్రాంతాల నుంచి నారుమళ్ళు తెచ్చి ఊడ్పులకు సమాయుత్తమవుతున్నారు. ఎల్లండిపేట కొవ్వాడ రిజర్వాయర్ వద్ద నీటిమట్టం 89.80 మీటర్లు నమోదయ్యిందని 120 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు సిబ్బంది తెలిపారు.
Advertisement
Next Story