పట్టపగలు దారిదోపిడీ కలకలం: సచివాలయ సిబ్బంది నగదు దోచుకెళ్లిన దుండగులు

by Disha Web Desk 21 |
పట్టపగలు దారిదోపిడీ కలకలం: సచివాలయ సిబ్బంది నగదు దోచుకెళ్లిన దుండగులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనకాపల్లి జిల్లాలో పట్ట పగలు దారి దోపిడీ జరగడం కలకలం రేపింది. నక్కపల్లి మండలం జానకియ్యపేట గ్రామానికి పింఛను నగదు పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది స్కూటీపై నగదు తీసుకెళ్తుండగా..దోపిడీ దొంగలు దారి కాచి నగదు దోచుకెళ్లారు. హెటిరో మందుల పరిశ్రమకు సంబంధించిన సెజ్‌ రహదారిలో స్కూటీపై వెళ్తున్న సచివాలయ సిబ్బంది కళ్లలో కారం చల్లి, స్కూటీ డిక్కీలో ఉన్న సుమారు రూ.14లక్షల నగదును ఇద్దరు దుండగులు అపహరించినట్టు సిబ్బంది వాపోయారు. జరిగిన ఘటనపై హుటాహుటిన నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో నర్సీపట్నం ఏసీపీతో పాటు పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే తరహా ఘటన గుళ్లిపాడు వెళ్లే రహదారిలో జరిగింది. మహిళను బెదిరించి సుమారు నాలుగు తులాల బంగారాన్ని దోపిడీ దొంగలు ఎత్తు కెళ్లారు. వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed