అంగన్‌వాడీలను పండుగకు దూరం చేసిన సర్కార్.. ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్

by Disha Web Desk 1 |
అంగన్‌వాడీలను పండుగకు దూరం చేసిన సర్కార్.. ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : అంగన్‌‌వాడీలను పండుగకు దూరం చేసిన సీఎం జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో సంక్రాంతి సంబురాలు చేసుకంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. పోయిన ఎన్నికల్లో అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.06 లక్షల మంది అంగన్‌వాడీలు నిరసన బాటపడితే.. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన హామీలు పరిష్కరించడానికి మళ్లీ చర్చడం జరపడం ఏంటని ప్రశ్నించారు. ఏది ఏమైనా.. పండగ పూట అంగన్‌వాడీలను జగన్ వీధులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్‌‌వాడీల డిమాండ్లను పరిష్కరించి వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed