ఎంఎన్‌జే హాస్పిటల్‌లో సౌకర్యాల నిల్.. సీపీఐ ఎమ్మెల్యే ఆగ్రహం

by Disha Web Desk 16 |
ఎంఎన్‌జే హాస్పిటల్‌లో సౌకర్యాల నిల్..  సీపీఐ ఎమ్మెల్యే ఆగ్రహం
X

దిశ ,తెలంగాణ బ్యూరో: ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్‌లో చిన్న పిల్లల వార్డు న్యూ బ్లాక్‌లో కనీస త్రాగునీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేక రోగులు, డాక్టర్స్ చాాలా ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే త్రాగునీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


నూతనంగా నిర్మించిన బ్లాక్లో 200 మంది క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలకు డ్రింకింగ్ వాటర్ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. ఆరోగ్య శాఖ స్పందించి తక్షణమే క్యాన్సర్ హాస్పిటల్‌లో నీరు మంచినీటి వసతి, మౌలిక వసతులు కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.

Next Story