- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిర్యానీ తీసుకురమ్మన్న భర్త.. సూసైడ్ చేసుకున్న భార్య.. ఆ తర్వాత!
బిర్యానీ విషయంలో దంపతుల మధ్య జరిగిన మాటల యుద్ధం.. ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళ్లింది. నాలుగేళ్ల కొడుకుని అనాధను చేసి ప్రాణాలు తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్న రోజులివి. బిర్యానీ కోసమై దంపతుల మధ్య జరిగిన వాగ్వాదం.. వారి ప్రాణాలను వారే బలితీసుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన బలరాం (33), ప్రియాంక (30) లుకొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో నాలుగేళ్ల కుమారుడితో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బలరాం ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. ఆదివారం రాత్రి మద్యం సేవించేందుకు బయటకు వెళ్లిన బలరాం.. భార్యకు ఫోన్ చేసి బిర్యానీ తీసుకురావాలని చెప్పాడు. దాంతో ప్రతీసారి ఈ మద్యం తాగడం ఎక్కువవుతోందని ప్రియాంక గొడవ పడింది. బిర్యానీకి తనవద్ద డబ్బులేదని చెప్పడంతో.. ఇద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. ప్రియాంకను బలరాం ఇష్టానుసారం తిట్టడంతో.. ఆమె మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన బలరాం.. ప్రియాంక ఉరికి వేలాడుతుండటం చూసి భయాందోళనకు గురయ్యాడు. ఆ చిన్నారి కళ్లెదుటే అదే ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పిల్లాడి ఏడుపు విన్న స్థానికులు సోమవారం ఉదయం తలుపులు తెరిచి చూడటంతో ఇద్దరూ ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ఇద్దరి మధ్యన గొడవ జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అభం శుభం తెలియని చిన్నారి.. తల్లిదండ్రులు లేని అనాదయ్యాడు. అమ్మా, నాన్న అంటూ అమాయకంగా ఏడుస్తున్న పిల్లాడిని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.






