AP News: ‘రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్ల నిర్మాణం’.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP News: ‘రాష్ట్ర వ్యాప్తంగా బీసీ భవన్ల నిర్మాణం’.. మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవనలు నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత(Minister Savita) తెలిపారు. బీసీ యువతకు స్వయం ఉపాధి పథకాలు(Self Employment Schemes) అందజేయనున్నట్లు తెలిపారు. సోమందేపల్లి మండలం కేంద్రంలో రూ.80 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో నిర్మించనున్న భగీరథ కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోమందేపల్లి లో అభివృద్ధి పనుల నిమిత్తం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. సోమందేపల్లి మండలంలో రూ.5 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలో 1.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం ప్రారంభించామని, త్వరలో రోడ్లు వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సోమందేపల్లి లో నాలుగు బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు.

HNSS కాలువ ద్వారా పైప్ లైన్లు నిర్మించి 300 ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. ప్రస్తుతం సోమందేపల్లి రైతులు ఆ నీటితో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. త్వరలో సోమందేపల్లి లో జూనియర్ కళాశాల(Junior College)తో పాటు ఐటీఐ(ITI) కూడా నిర్మించనున్నామని, వచ్చే ఏడాది నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు. గడిచిన ఎన్నికల్లో తన విజయంలో సోమందేపల్లి వాసులు అండగా నిలిచారన్నారు. తన తండ్రిలాగే తనను కూడా ఆదరిస్తున్న భగీరథ సోదరులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యేగా మీరు అవకాశమిస్తే.. మంత్రి పదవి ఇచ్చి తనను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రోత్సహించారన్నారు. సోమందేపల్లి రుణం తీర్చుకునేలా అభివృద్ధి పనులు చేపడుతానన్నారు. త్వరలో మరిన్ని రహదారుల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. ముఖ్యంగా భగీరథుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భగీరథ కల్యాణ మండపం నిర్మాణానికి సొంతంగా రూ.5 లక్షలు అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed