ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టడంలో కుట్రకోణం: ఏపీ హోంమంత్రి

by Mahesh |
ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టడంలో కుట్రకోణం: ఏపీ హోంమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విజయవాడలోని కృష్ణ నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లకు బలంగా ఢీ కొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనపై సోమవారం హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టడంలో కుట్రకోణం ఉందని.. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని..ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారని అన్నారు. అలాగే ఈ ఘటనపై గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో కూర్చుని మాట్లాడడం సరికాదని, వరద బాధితుల కోసం ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారని, వాటర్‌ ప్యాకెట్ కూడా ఇవ్వనోళ్లు వరదలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మాజీ సీఎం మాత్రం బెంగళూరు వెళ్లారని అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story

Most Viewed