అల్లు అర్జున్‌పై పొగడ్తలు.. పవన్‌పై సెటైర్లు

by Disha Web Desk 16 |
అల్లు అర్జున్‌పై పొగడ్తలు.. పవన్‌పై సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు అల్లు అర్జున్‌ను ప్రేక్షకులు మెగా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తారు. తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్ వారసత్వంగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఆయన చిరంజీవి ఆశీస్సులతో సొంత టాలెంట్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అయినా కానీ అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానే. ఈ విషయాన్ని స్టైలీష్ స్టార్ చాలా వేదికల్లో చెప్పారు. కానీ కొంతమంది మాత్రం రాజకీయాల పరంగా అల్లు అర్జున్‌ను పొగుడుతూ మెగా ఫ్యామిలీని కించపర్చడం అలవాటుగా చేసుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఇదే విధంగా టార్గెట్ చేశారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సేమ్ టు సేమ్ అదే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతకాలం చిరంజీవిని పొగుడుతూ పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపిస్తూ జనసేనానిపై సెటైర్లు వేస్తున్నారు.తాజాగా వైసీపీ నేత పోతిన మహేశ్ కూడా పవన్‌పై అలానే కించపర్చుతూ మాట్లాడారు. అల్లు అర్జున్‌ను పొగుడుతూ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. చాలా కాలంపాటు జనసేనలో పని చేసిన పోతిన మహేశ్ ఆ పార్టీ తరపున సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బురద చల్లుతున్నారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించి పవన్ కల్యాణ్‌ను తక్కువ చేసి మాట్లాడారు. పవన్ కల్యాణ్ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ అని అంటారని, కానీ అసలు బ్రాండ్ అల్లు అర్జున్ అని పోతిన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ నమ్ముకున్న వాళ్లంతా సినీ ఇండస్ట్రీలో చాలా ఎత్తుకు ఎదిగారని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి పవన్ కల్యాణ్ ఏమీ చేయలేదని, కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా చేశారని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో ఎంతమందిని పవన్ కల్యాణ్ పైకి తీసుకొచ్చారో చెప్పాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed