డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం స్పందించాలి: బొండా ఉమా

by Disha Web Desk 11 |
డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం స్పందించాలి: బొండా ఉమా
X

దిశ, ఏపీ బ్యూరో: డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీనే నెంబర్ వన్ అంటూ స్మగ్లింగ్ ఇన్ ఇండియా ఇచ్చిన నివేదికపై సీఎం జగన్ స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఉమామహేశ్వరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 18,267కిలోల డ్రగ్స్ దొరికాయన్న నివేదిక చెబుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీకి ఇండస్ట్రీలు వస్తే, జగన్ జమానాలో ఈడీ, ఐటీ, సీబీఐలు వస్తున్నాయని ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఉమా మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతులేని విధంగా రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అన్నపూర్ణగా, స్వర్ణాంధ్రగా పిలువబడిన ఆంధ్రప్రదేశ్, జగన్ పాలనలో నేర, ఘోరాంధ్రప్రదేశ్ గా మారిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఇండస్ట్రీలు తీసుకురావడంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, శాంతిభద్రతల రక్షణలో, అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. జగన్ పాలనలో అంతులేని విధంగా క్రైం రేట్ పెరిగిందని. డ్రగ్స్ స్మగ్లింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఏపీ కేంద్రంగా దేశం నలుమూలలకు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు అడ్డాగా మార్చారని, ఉత్తరాంధ్రను గంజాయి డెన్‌గా మార్చిన ఘనుడు విజయసాయిరెడ్డి అని ఉమా ఆరోపించారు.


Next Story

Most Viewed