HYD: హైదరాబాద్ కాపు నేతలకు సీఎం కేసీఆర్ కీలక హామీ

by Disha Web Desk 16 |
HYD: హైదరాబాద్ కాపు నేతలకు సీఎం కేసీఆర్ కీలక హామీ
X

దిశ, ఏపీ బ్యూరో: హైదరాబాద్‌లో కాపు భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్​ సహకారం అందించేందుకు సానుకూలంగా స్పందించారు. బీఆర్‌ఎస్​‌ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్​ నేతృత్వంలో జంట నగరాల్లోని కాపు సామాజికవర్గానికి చెందిన పలువురు ఐ‌ఏ‌ఎస్, ఐపీ‌ఎస్, ఐఆర్ఎస్ అధికారులు, పారిశ్రామిక వేత్తల బృందం సీఎం కే‌సీ‌ఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించి భవన నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించారు. ఇందుకు కేసీఆర్​సానుకూలంగా స్పందిస్తూ కాపు భవన నిర్మాణానికి తన వంతుగా సంపూర్ణ సహకారం తప్పక అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, రామ్ మోహన్, లక్ష్మీకాంతం, గోపాలకృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారులు తోట మురళీకృష్ణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, చింతల పార్థసారథి, పారిశ్రామిక వేత్తలు మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, టీసీ అశోక్, ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు, ఎంహెచ్ రావు , శ్రీహరి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. నోరు అదుపులో పెట్టుకో: మంత్రి ప్రశాంత్ రెడ్డి వార్నింగ్



Next Story

Most Viewed