సీఎం జగన్ పై దాడి జరిగింది ఇక్కడి నుంచే..?

by Disha Web Desk 12 |
సీఎం జగన్ పై దాడి జరిగింది ఇక్కడి నుంచే..?
X

దిశ, వెబ్‌డెస్క్: శనివారం రాత్రి వైసీపీ అధినేత, సీఎం జగన్ విజయవాడలో నిర్వహిస్తున్న ఎన్నికల బస్సు యాత్ర పై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మ పై గాయం అయింది. ఈ దాడి అనంతరం బస్సులోనే ప్రథమ చికిత్స చేయించుకున్న జగన్ వెంటనే యాత్రను కొనాసాగించారు. కాగా ఈ ఘటపై స్పందించిన ఈసీ సీరియస్ అయింది. బస్సు యాత్ర జరుగుతున్న సింగ్ నగర్ లోని ఓ పాఠశాల వద్దకు రాగానే.. రాళ్ల దాడి జరిగింది. కాగా దాడికి పాల్పడిన నిందితులు స్కూల్‌లోని ఓ అంతస్తులో నక్కి.. పవర్ కట్ అయిన సమయంలో దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా దాడి జరిగిన ప్రాంతాన్ని మొత్తం సీజ్ చేసిన అధికారులు ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన ఎన్నికల అధికారులు.. దర్యాప్తు చేసి వెంటనే నిందితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

Next Story

Most Viewed