చంద్రబాబును నమ్మొద్దు.. రాప్తాడు సిద్ధం సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
చంద్రబాబును నమ్మొద్దు.. రాప్తాడు సిద్ధం సభలో జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ నిర్వహించారు. వచ్చే ఎన్నికలపై పార్టీ కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 2024 ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగుతుందని తెలిపారు. పెదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని జగన్ వ్యాఖ్యానించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరగబోతున్నట్లు ఆయన తెలిపారు. పెత్తందారులతో యుద్ధానికి మీరూ సిద్ధమా అంటూ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన ఏ ఒక్క మంచి పనైనా ఉందా అని సీఎం జగన్ నిలదీశారు.

చంద్రబాబు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారని, రైతులకు ఒక్క మంచి పనైనా చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా అని వ్యాఖ్యానించారు. టీడీపీ హాయంలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అని నిలదీశారు. 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదన్నారు. మళ్లీ అబద్ధాలు, మోసాలతో వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పిలుపు నిచ్చారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలేనని, చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎద్దేవా చేశారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు మార్క్ ఉందా అని విమర్శించారు. చంద్రబాబు అబద్దాలను నమ్మొద్దని ఇంటింటికి వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. చొక్కా మడతపెట్టి ప్రజలు టీడీపీని 23కే పరిమితం చేశారన్నారు. చంద్రబాబును మళ్లీ ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ జోస్యం చెప్పారు. 57 నెలల పాలనలో అన్ని మంచి పనులు చేశామని చెప్పారు. ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూస్తున్నామని చెప్పారు. అక్కచెల్లెమ్మలందరికీ చాలా మేలు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed