చంద్రబాబు సొంత గడ్డపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
చంద్రబాబు సొంత గడ్డపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో పర్యటించిన ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. కుప్పాన్ని చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును భరిస్తున్న కుప్పం ప్రజల సహనానికి తన జోహార్లు అంటూ వ్యాఖ్యానించారు. కుప్పంలో 87 వేల కుటుంబాలు ఉండగా 82 వేల కుటుంబాలు తమ ప్రభుత్వ పథకాలు అందుకున్నాయని తెలిపారు. కుప్పం ప్రజలందరూ బ్యాంకులు వెళ్లి ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకోవాలని చెప్పారు. కుప్పంలో మరో 15 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 35 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండి మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. కుప్పానికి ఏమీ చేయలేని వ్యకి వల్ల ఏం ప్రయోజనం ఉందన్నారు. తనకు లాభాలు తెచ్చే పనులు మాత్రమే చంద్రబాబు చేస్తారని.. తాను మాత్రం కుప్పం ప్రజలకు చాలా మేలు చేశానని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు చాలా ఇచ్చారని.. మరి ఆయన ఏం చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థి భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed