నేడు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన

by Jakkula Mamatha |
నేడు కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శనివారం) నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఉండపల్లి నుంచి హెలికాప్టర్ లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు ఆయన చేరుకుంటారు.

12.05 గంటలకు దూరగుంట శివారులో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. 12.20 గంటలకు దూబగుంట గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. 1.30 గంటలకు కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలో సీఎం ప్రసంగించడం తో పాటు ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్‌లో ఉండవల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

Next Story