- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
AP:పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. గత ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నేడు(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ వెళుతూ.. వెళుతూ ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం శాశ్వతంగా కొనసాగిస్తుందని మరోసారి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రూ.4 వేలకు పెంచామని గుర్తు చేశారు. ఒకటో తారీఖు రాగానే అధికారులు మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారా? అని కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను సీఎం ప్రశ్నించారు. ఇక పై ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇలానే కొనసాగుతోందని హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయిందని.. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదని అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 22A పేరుతో భూములు దోచుకున్నారు అని సీఎం మండిపడ్డారు. ఈ క్రమంలో ఇక నుంచి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.