- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. విభజన హామీలపై చర్చ
సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 10, బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరుకానున్నారు. గురువారం.. రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 9.15 గంటలకు ఈ సమావేశం ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఈ సమావేశంలో త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం. వీటితోపాటు ఏపీకి సంబంధించిన కీలక అంశాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర సహాయ నిధులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర అధినాయకత్వంతో చర్చించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.






