- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏపీకి భారీ నష్టం..అధికారిక లెక్కలివిగో...!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వరద (Ap Floods) కారణంగా మూడు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఇళ్లు, రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. వరద నీటిలో ఇళ్లలోని సామాన్లు సైతం కొట్టుకుపోయాయి. ముఖ్యంగా వరద బీభత్సంతో విజయవాడ (Vijayawada) విలవిలలాడిపోయింది. బుడమేరు వాగు నగరంలోని చాలా కాలనీల్లో నడుంమేర నీళ్లు వెళ్లాయి. దీంతో లక్షల్లో జనాలు నిరాశ్రయిలుగా మిగిలిపోయారు. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. సీఎం చంద్రబాబు (Cm Chandrababu) వరద ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి సహాయ చర్యలు అందించారు. దీంతో అధికారులు వరద నష్టంపై అంచనాలు రెడీ చేశారు. ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. దీంతో ఈ రిపోర్టును కేంద్రానికి పంపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కురిసిన వర్షం, వరదల బీభత్సంలో రూ.6,880 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు నివేదిక పంపామని తెలిపారు. తర్వాత సాయం చేయాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. వరదలతో 28 మంది చనిపోయారని, ఇద్దరు గల్లంతయ్యారని సీఎం పేర్కొన్నారు. వరద ప్రభావత ప్రాంతాల్లో విద్యుత్ సప్లయ్, మెడికల్ క్యాంప్‌లు, ఆహారం పంపిణీ చేస్తున్నామన్నారు. అటు శానిటేషన్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. లక్షా 40 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివారం బుడమేరు పరివాహక ప్రాంతంలో 1.86 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. విజయవాడలోకి 0.32 టీఎంసీల నీళ్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. గండ్లు పూడ్చడంతో బుడమేరుకు ఇన్ ఫ్లో నిలిచిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని, ప్రస్తుతం సరిదిద్దామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజలు బలి అయ్యారని మండిపడ్డారు.