- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఆసుపత్రిలో రజినీకాంత్.. CM చంద్రబాబు రియాక్షన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అనారోగ్యం బారినపడిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన అనారోగ్యంపై రాజకీయాలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ అనారోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘నా మిత్రుడు, సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో ఆయన వర్ధిల్లాలి’ అని ట్వీట్ పెట్టారు.
నారా లోకేష్ సైతం స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.. కాసేపటికి క్రితమే రజినీకాంత్ హెల్త్ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. రజనీకాంత్‌కు రక్త నాళాల్లో ఇబ్బందులున్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే రజినీకాంత్‌కు ఎలక్టీవ్ ప్రొసీజర్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
Wishing my friend, superstar @rajinikanth a speedy and full recovery. I pray for his health and longevity.
— N Chandrababu Naidu (@ncbn) October 1, 2024